LOADING...
 Sarfaraz Khan : టీమిండియాలో స్థానం కోసం ఫిట్‌గా మారిన సర్ఫరాజ్ ఖాన్.. నెటిజన్ల ప్రశంసలు!
టీమిండియాలో స్థానం కోసం ఫిట్‌గా మారిన సర్పరాజ్ ఖాన్.. నెటిజన్ల ప్రశంసలు!

 Sarfaraz Khan : టీమిండియాలో స్థానం కోసం ఫిట్‌గా మారిన సర్ఫరాజ్ ఖాన్.. నెటిజన్ల ప్రశంసలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ జట్టులో చోటు కోల్పోయిన బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ తన ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి పెట్టాడు. ఇంగ్లండ్ పర్యటనకు ఐదు టెస్టుల సిరీస్‌లో ఎంపిక కాకపోవడంతో, మళ్లీ టీమిండియాలో స్థానం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్ఫరాజ్‌ తన అధిక బరువును తగ్గించుకునేందుకు కఠినమైన ప్రయత్నం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతను గత రెండు నెలల్లోనే ఏకంగా 17 కిలోల బరువు తగ్గి స్లిమ్‌ అవతారం ఎత్తాడు. అంతకుముందు బొద్దుగా కనిపించిన సర్ఫరాజ్‌ ప్రస్తుతం జిమ్‌లో కసరత్తులు చేస్తూ శరీరాన్ని ట్రిమ్‌ చేసుకున్నాడు. అతను 95 కిలోల నుంచి 78 కేజీలకు తగ్గినట్లు సమాచారం. దీని వెనుక ఉన్న రహస్యం - ప్రత్యేక ఆహార నియమాలు.

Details

ఇన్‌స్టాగ్రామ్‌  లో స్టోరీ చేసిన సర్పరాజ్ ఖాన్

ఉడకబెట్టిన కూరగాయలు, చికెన్‌ వంటి ఆరోగ్యకరమైన భోజనాలను మాత్రమే తీసుకుంటూ వేగంగా బరువు తగ్గాడు. తన ఈ మార్పును సూచిస్తూ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇటీవల జిమ్‌లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్ చేశాడు. వీటిని చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'వావ్.. ఇలా సన్నగా మారిపోయాడా?, ''2 నెలల్లో 17కేజీలు తగ్గాడా.. అదుర్స్‌!'' అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. 27 ఏళ్ల సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇప్పటివరకు భారత్ తరఫున 6 టెస్టులాడి 371 పరుగులు చేశాడు. చివరిసారిగా 2023 నవంబర్‌లో వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రదర్శన ఇచ్చాడు. టీమ్‌లో తిరిగి చోటు దక్కించుకోవాలనే పట్టుదలతో ఇప్పుడు తన శారీరక దృఢతను మరింత మెరుగుపరచాలన్నదే సర్ఫరాజ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.