LOADING...
Sarfaraz Khan: టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?
Sarfaraz Khan: టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?

Sarfaraz Khan: టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2024
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ కివీస్‌తో జరుగుతున్న తొలిటెస్టులో ఆకట్టుకున్నాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు ఆధిక్యం అందించిన సర్ఫరాజ్, ముంబైలో జన్మించాడు. రంజీ, ఐపీఎల్‌లోనూ మంచి ప్రదర్శన చేస్తున్నారు. సర్ఫరాజ్ నెట్‌వర్త్ ..అతడి కార్ల కలెక్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

రంజీ స్థాయిలో అదుర్స్ 

1997 అక్టోబర్ 22న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించిన సర్ఫరాజ్, చిన్నప్పటి నుంచే క్రికెట్‌లో ఆసక్తి ప్రదర్శించాడు. 2015లో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అడుగు పెట్టాడు. దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2022-23 రంజీ సీజన్‌లో సర్ఫరాజ్ 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

వివరాలు 

నెట్‌వర్త్ ఎంతంటే? 

సర్ఫరాజ్ నెట్‌వర్త్ రూ.16.6 కోట్లుగా ఉన్నట్టు పలు వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. ఈ సంపద బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్టులు, దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ఫీజులు, ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా అందింది. 2021లో ఆర్‌సీబీ నుండి రూ.25 లక్షలు పొందాడు. ఐపీఎల్ ఆదాయం, ఎండార్స్‌మెంట్లు, మ్యాచ్ ఫీజులు కలిసి అతడి సంపాదనను పెంచాయి. అయినప్పటికీ, ముంబయిలోని పాత ఇంటిలోనే సర్ఫరాజ్ నివసిస్తున్నాడు. సాధారణ జీవన శైలిని కొనసాగిస్తున్నాడు. అతడికి రెనో డస్టర్ ఎస్‌యూవీ, ఆడి కారు ఉన్నాయి.

వివరాలు 

బ్రాండ్ విలువ పెరగడానికి అవకాశం! 

ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్, కివీస్‌తో జరుగుతున్న టెస్టులో సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. సర్ఫరాజ్ స్థిరంగా రాణిస్తే, అతడి ఆస్తులు పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే అతడి బ్రాండ్ విలువ పెరుగుతుంది. కాంట్రాక్టుల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. సర్ఫరాజ్ కెరీర్ - టీమిండియా తరఫున మూడు 4 టెస్టులు ఆడిన సర్ఫరాజ్ 325 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. అలాగే 50 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ 585 పరుగులు సాధించాడు, అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.