Page Loader
ఇండియా  ఓపెన్స్ నుండి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి అవుట్
ఇండియా ఓపెన్స్ నుండి తప్పుకున్న సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్

ఇండియా ఓపెన్స్ నుండి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి అవుట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2023
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి గురువారం ఇండియా ఓపెన్ నుంచి తప్పుకున్నారు. స్వాతిక్, చిరాగ్ లు సూపర్ 750 ఈవెంట్ నుండి నిష్క్రమించారు. న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీ రెండో రౌండ్‌లో వీరిద్దరూ చైనాకు చెందిన యు చెన్ లియు, జువాన్ యి ఓయుతో తలపడాల్సి ఉంది. సాత్విక్ గాయం భారీన పడటంతో దురదృష్టవశాత్తూ టోర్నమెంట్ నుండి వైదొలగాల్సి వచ్చింది. ఇండియా ఓపెన్‌ తొలి రౌండ్‌లో స్కాట్‌లాండ్‌కు చెందిన గ్రిమ్లీ కవలలపై సాత్విక్-చిరాగ్ 21-13, 21-15 తేడాతో విజయం సాధించారు. మలేషియా ఓపెన్ 2023లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ సెమీ-ఫైనల్ పోరులో ఓడిపోయారు

బ్యాడ్మింటన్

ఇది విచారకరమైన క్షణం

క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో పునరాగమనం చేసిన తర్వాత, జోడీ లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్‌లతో జరిగిన మ్యాచ్‌ సాత్విక్, చిరాగ్ 16-21, 21-11, 15-21 తేడాతో ఓడిపోయారు. ఇది మనందరికీ విచారకరమైన క్షణమని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురువారం ట్వీట్ చేసింది. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌-2022లో భాగంగా భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ చిరాగ్‌ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి పతకం సాధించిన విషయం తెలిసిందే.