IPL 2026 : గాయాల ప్రభావం.. కోల్‌కతా,సన్‌రైజర్స్ జట్లలో మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. నడుము నొప్పి కారణంగా ఆకాశ్ దీప్ ఈ సీజన్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి కోల్‌కతా జట్టు ఎడమచేతి వేగవంతమైన బౌలర్ సౌరభ్ దూబెను ఎంపిక చేసింది. ఈ ఒప్పందం ప్రకారం దూబెకు రూ.30 లక్షలు చెల్లించనున్నారు. దూబె రావడంతో ఆ జట్టుకు బౌలింగ్‌లో బలం చేకూరినట్లు అయ్యింది.
వివరాలు
సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కూడా గాయాల దెబ్బ
ఇదే సమయంలో గాయం కారణంగా జాక్ ఎడ్వర్డ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ పేన్‌ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అతనికి రూ.1.5 కోట్లను సన్ రైజర్స్ చెల్లించనుంది. అలాగే శ్రీలంకకు చెందిన ఆల్‌రౌండర్ డాసుక శనకను రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి చేర్చుకోనుంది. ఈ ఒప్పందం కింద అతనికి సుమారు రూ.75 లక్షలు అందే అవకాశం ఉంది.