దాయాది జట్లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఐసీసీ మెగా టోర్నీలో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా - పాకిస్థాన్ జట్లు సెమీస్‌లో తలపడితే చూడాలని ఉందని ఆకాంక్షించారు.
భారత్ వేదికగా వచ్చే అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది.
ఈ మేరకు భారత్ లోని 10 మైదానాల్లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ సైతం విడుదలైంది. వన్డే వరల్డ్ కప్ లో విన్నర్ గా నిలిచేందుకు అన్ని జట్లు కసరత్తును మొదలుపెట్టాయి.
మరో వైపు స్వదేశంలో జరగనన్న ఈ మెగా టోర్నీలో విజేతగా ఎవరు నిలుస్తారనే అంశంపై మాజీ క్రికెట్ స్టార్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
DETAILS
కచ్చితంగా భారత్ నౌకౌట్ దశ దాటుతుంది : సౌరవ్ గంగూలీ
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో గంగూలీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఆసీస్, ఇంగ్లండ్ , భారత్ జట్లు సెమీస్‌కు చేరేందుకు అవకాశాలు ఉన్నాయని గంగూలీ అన్నారు. అయితే మెగా టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టును అంచనా వేయడం కష్టమన్నారు.
కివీస్ కు సైతం సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయన్నారు. పాక్ సెమిస్ కు చేరే అవకాశం ఉందని దాదా వివరించారు. ఒకవేళ పాక్ సెమీస్ కు చేరితే ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగనుందన్నారు.
ప్లాన్ అమలులో లోపాల కారణంగా గతంలో పలు టోర్నీల్లో భారత్ నాకౌట్ దశల్లోనే వెనక్కి రావాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కానీ ఈసారి టీమిండియా నాకౌట్ దశను తప్పకుండా దాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.