LOADING...
ICC Womens World Cup: టీమిండియాకు వరుసగా రెండో ఓటమి.. సెమీస్‌ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? 
టీమిండియాకు వరుసగా రెండో ఓటమి.. సెమీస్‌ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

ICC Womens World Cup: టీమిండియాకు వరుసగా రెండో ఓటమి.. సెమీస్‌ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

వారం ముందువరకు మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 (Women's ODI World Cup 2025)లో భారత్‌ అద్భుతంగా ప్రారంభించింది. మొదటి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించడంతో అభిమానులు భారత జట్టును ఏ జట్టుకి ఎదురుగా పెట్టినా ఓడించగలదని భావించారు. అయితే ఆ జోష్ ఎక్కువ కాలం కొనసాగలేదు. సఫారీ జట్టు, ఆస్ట్రేలియాతో వరుసగా రెండు పరాజయాలు రావడంతో భారత్‌ సెమీస్‌ అవకాశాలను ప్రమాదంలో పడేసుకుంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లపై ప్రభావం చూపింది.

Details

మ్యాచ్ లీగ్, భారత్ స్థానం

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో మొత్తం ఎనిమిది జట్లు ఉన్నాయి. ఒక్కో జట్టు లీగ్ స్టేజ్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడాలి. భారత్‌ ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడింది, ఇందులో రెండు విజయాలు, రెండు ఓటములు నమోదు చేసింది. ఈ ప్రదర్శనతో 4పాయింట్లు సాధించి, ప్రస్తుతంగా పట్టికలో మూడో స్థానంలో ఉంది. టాప్-4లో ఉన్న జట్లు మాత్రమే సెమీస్‌కి ప్ర‌వేశిస్తాయి. మిగిలిన మూడు మ్యాచ్‌లలో భారత్‌ ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌తో పోరాడాల్సి ఉంది. ఈ జట్లు తేలికపాటివి కాదనే చెప్పాలి. ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించకపోతే సెమీస్‌కి చేరడం కష్టతరం అవుతుంది. ప్రత్యేకంగా ఇంగ్లాండ్‌తో వచ్చే ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఈ ఆటలో ఓడితే సెమీస్‌ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

Details

 పాయింట్ల పట్టిక

ఆస్ట్రేలియా - 7 పాయింట్లు * ఇంగ్లాండ్ - 6 పాయింట్లు * భారత్‌ - 4 పాయింట్లు దక్షిణాఫ్రికా - 4 పాయింట్లు * న్యూజిలాండ్ - 2 పాయింట్లు * బంగ్లాదేశ్ - 2 పాయింట్లు శ్రీలంక - 1 పాయింట్ * పాకిస్థాన్ - 0 పాయింట్లు

Details

సెమీస్ అవకాశాలు ఇవే

మిగిలిన మూడు మ్యాచ్‌లలో భారత్‌ గెలిస్తే, టాప్-4లో స్థిరంగా ఉండి సెమీస్‌కి చేరుకోవచ్చు. * నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చితే ఇబ్బంది ఉండదు. ఇంగ్లాండ్‌తో ఓటమి అయినా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించగలిగితే ఇంకా అవకాశం ఉంటుంది. ఏ ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడితే, సెమీస్‌ ఛాన్స్ కష్టం అవుతుంది, కప్ కల కూడా సవాల్‌ అవుతుంది. కనీసం 10 పాయింట్లను సాధించిన జట్లు మాత్రమే సెమీస్‌కి చేరుతాయి. పాకిస్థాన్ ఇప్పటివరకు గెలిచిన ఒక్క మ్యాచ్‌ కూడా లేదు కాబట్టి, ఈ రేసులో దాదాపు బయట అయ్యింది.