
ENG vs IND: 'లార్డ్స్'లో రెండో ఇన్నింగ్స్ ఛేజ్‌లు.. గెలిచిందెవరు? ఓడిందెవరు?
ఈ వార్తాకథనం ఏంటి
లార్డ్స్ మైదానం అనే క్రికెట్ పుట్టినిల్లు... ఇక్కడ టీమిండియా విజయాన్ని సాధించాలంటే ఇప్పటికీ 135 పరుగులు అవసరం. ఇంగ్లండ్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమ్‌ఇండియా ప్రస్తుతం 58/4తో ఆట కొనసాగిస్తోంది. లార్డ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు చరిత్రలో ఎక్కువగా ఓటమినే చవిచూశాయి. అయితే ఇటీవలే జరిగిన కొన్ని మ్యాచ్‌ల ఫలితాలు మాత్రం భారత్‌కు నమ్మకం కలిగించేవిగా ఉన్నాయి.
Details
లార్డ్స్‌లో భారత్ విజయ చరిత్ర ఇదే
ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ చివరిసారిగా 1986లో ఛేదించి విజయాన్ని అందుకుంది. అప్పట్లో 133 పరుగుల లక్ష్యాన్ని చేరేందుకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ మ్యాచ్‌లో కపిల్ దేవ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. రవిశాస్త్రి, అజహరుద్దీన్ కీలకంగా రాణించారు. అయితే తర్వాత 1990, 2002లో ఇంగ్లాండ్ పెట్టిన భారీ టార్గెట్లను భారత్ ఛేదించలేక ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ లక్ష్యాలు 460 పరుగులకుపైగా ఉండటం గమనార్హం.
Details
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చరిత్ర మార్చిన దక్షిణాఫ్రికా
ఇటీవలే లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆకట్టుకునే ప్రదర్శనతో టైటిల్ అందుకుంది. ఆసీస్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఐదు వికెట్లతో ఛేదించి గెలుపొందింది. ఇది కాకుండా, 2022లో ఇంగ్లండ్ కూడా న్యూజిలాండ్ నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విజయం సాధించింది. అంటే, ఈ మధ్యకాలంలో మోస్తరు లక్ష్యాలను ఛేదించే పరిస్థితులు ఏర్పడినట్టు అనిపిస్తోంది.
Details
భారత్‌కు కఠిన సవాలే
లార్డ్స్ పిచ్ ప్రస్తుతం బౌలర్లకు అనుకూలంగా మారినప్పటికీ, భారత్ విజయానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చివరి రోజు తొలి గంట ఆట చాలా కీలకం. పరుగులు రాకపోయినా వికెట్లు కోల్పోకుండా క్రీజ్‌లో నిలబడితే, విజయ దారిలో భారత్ నడవవచ్చు. కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉండగా, ఇంకా నలుగురు ప్రధాన బ్యాటర్లు మిగిలి ఉండటం భారత్‌కు ప్లస్ పాయింట్.
Details
లార్డ్స్‌లో ఇప్పటి వరకు జరిగిన భారీ ఛేజ్‌లు
వెస్టిండీస్ vs ఇంగ్లాండ్ (1984) - 344/1 ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ (2004) - 282/3 దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా (2025) - 282/5 ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ (2022) - 279/5 ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ (1965) - 218/3 ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ (2012) - 193/5 ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ (2000) - 191/8 ఇవి చూస్తే, 200 పరుగుల లోపు లక్ష్యాలను ఛేదించిన ఉదాహరణలున్నాయి. భారత జట్టు ఆచితూచి ఆడితే, మళ్లీ 1986 చరిత్రను పునరావృతం చేసే అవకాశం వుంది.