
Mohammed Shami: సెలక్షన్ నా చేతుల్లో లేదు.. ఫిట్‌నెస్ వివాదంపై స్పందించిన మహ్మద్ షమీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా పర్యటన జట్టులో తనను ఎంపిక చేయకపోవడంపై భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నప్పటికీ, తన పేరును పరిగణలోకి తీసుకోకపోవడం తగదని తెలిపారు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్నానంటే ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి సమస్యలూ లేవనే అర్థం అని షమి స్పష్టం చేశాడు. ఈ నెల 19న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. షమిని ఫిట్‌నెస్ సందేహాల కారణంగా ఎంపిక చేయలేదన్న వార్తల నడుమ, ఆయన ఇదిపై స్పష్టత ఇచ్చాడు. 'ఎంపిక నా చేతుల్లో లేదు అని నేను ముందే చెప్పానని పేర్కొన్నారు.
Details
ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి ఆడుతూనే ఉంటా
నాకు ఫిట్‌నెస్ సమస్యలు ఉంటే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్నానా? దీనిపై మాట్లాడి కొత్త వివాదం సృష్టించాల్సిన అవసరం నాకు కనిపించడం లేదని షమి పేర్కొన్నాడు. అదేవిధంగా రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగే శారీరక సామర్థ్యం ఉన్న నాకు 50 ఓవర్ల క్రికెట్ ఆడటం పెద్ద విషయం కాదని చెప్పాడు. ఫిట్‌నెస్ గురించి సెలెక్షన్ కమిటీకి ప్రత్యేకంగా తెలియజేయడం, అడగడం లేదా సమాచారం ఇవ్వడం తన బాధ్యత కాదని స్పష్టం చేశాడు. 'ఎన్‌సీఏలో సిద్ధం కావడం, మ్యాచ్‌ల కోసం రెడీగా ఉండటం - అదే నా పని. నేను మైదానంలోకి దిగగలిగే స్థితిలో ఉన్నాను. ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటే నేను ఆడుతూనే ఉంటానని షమి స్పష్టం చేశాడు.