Page Loader
భారత సీనియర్ క్రికెట్ సలీం దురానీ కన్నుమూత
భారత సీనియర్ క్రికెట్ సలీం దురానీ కన్నుమూత

భారత సీనియర్ క్రికెట్ సలీం దురానీ కన్నుమూత

వ్రాసిన వారు Stalin
Apr 02, 2023
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ దిగ్గజం సలీం దురానీ (88) కన్నుమూశారు. 1961-62లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ఓడించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తన సోదరుడు జహంగీర్ దురానీతో కలిసి నివసిస్తున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. దురానీ 1934 , డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో జన్మించారు. అఫ్గాన్‌లో జన్మించి భారత్ తరఫున ఆడిన ఏకైక క్రికెటర్ దురానీ కావడం గమనార్హం. ఎడమచేతి వాటంతో సిక్స్ కొట్టడంలో దురానీ ప్రసిద్ధి. ఆల్ రౌండర్‌గా, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్‌గా జట్టు విజయాల్లో దురానీ కీలక పాత్ర పోషించారు.

సలీం దురానీ

'అర్జున' అవార్డు గెలుచుకున్న తొలి క్రికెటర్‌ దురానీ

1961-62లో ఇంగ్లండ్‌పై భారత్ సిరీస్ విజయం సాధించడంలో దురానీ హీరోగా నిలిచారు. కోల్‌కతాలో జరిగిన టెస్టు‌లో 8 వికెట్లు, చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టారు. 1973లో బాలీవుడ్ చిత్రం 'చరిత్ర' సినిమాలో నటి పర్వీన్ బాబీ సరసన నటించారు. 'అర్జున' అవార్డు గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా దురానీ నిలిచాడు. 2011లో బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. దురానీ 50 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఏడు అర్ధసెంచరీలు చేశారు. మొత్తం 1,202 పరుగులు చేశారు.