LOADING...
Shorna Akter: 18 ఏళ్లకే సంచలన రికార్డు.. షోర్నా అక్తర్ అద్భుతం!
18 ఏళ్లకే సంచలన రికార్డు.. షోర్నా అక్తర్ అద్భుతం!

Shorna Akter: 18 ఏళ్లకే సంచలన రికార్డు.. షోర్నా అక్తర్ అద్భుతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ 2025లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం వేదికగా గడచిన మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రేక్షకులను ఉత్సాహపరిచే పోరాటాలు చోటు చేసుకున్నాయి. సోమవారం జరిగిన బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. బంగ్లాదేశ్ విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ, దక్షిణాఫ్రికా జట్టు చివరి వరకు పోరాడి అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ యువ క్రీడాకారిణి షోర్నా అక్తర్ ప్రత్యేక హిస్టరీ సృష్టించింది. అక్తర్ 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి బంగ్లాదేశ్ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును నెలకొల్పింది.

Details

39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

ఈ రికార్డు ద్వారా సుల్తానా గతం నెలకొల్పిన 39 బంతులలో సాధించిన హాఫ్ సెంచరీ రికార్డు బద్దలు కొట్టింది. అదే కాకుండా, అక్తర్ ఈ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు కొట్టి, మహిళల ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లను సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రీడాకారిణిగా నిలిచింది. 2023లో శ్రీలంకతో జరిగిన వన్డేలో సుల్తానా గరిష్టంగా 2 సిక్సర్లు మాత్రమే సాధించగలిగింది. మొత్తానికి, 18 ఏళ్ల వయసులోనే షోర్నా అక్తర్ రెండు ప్రపంచ రికార్డులు సృష్టిస్తూ, బంగ్లాదేశ్ మహిళా క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది.