IPL 2026 Auction : ఐపీఎల్ మెగా వేలంలో సంచలన ట్విస్ట్.. 1355 మందిలో కేవలం 350 మందికే ఫైనల్ లిస్ట్ అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈసారి మొత్తం 1355 మంది ఆటగాళ్లు వేలానికి చేసుకోగా, బీసీసీఐ ఫ్రాంచైజీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జాబితాను భారీగా కుదించింది. చివరికి 1005 మందిని తొలగించి, కేవలం 350 మంది ఆటగాళ్లతో కూడిన ఫైనల్ షార్ట్‌లిస్ట్ మాత్రమే విడుదల చేసింది. దీంతో వేలం వేదికపై చాలా మంది ప్లేయర్లకు ఈసారి అవకాశమే లేకుండా పోయింది. ఈ ఫైనల్ జాబితాలో అత్యంత ఆసక్తికరమైన అంశం, చివరి నిమిషంలో చోటు దక్కిన 35 మంది కొత్త ఆటగాళ్లు. మొదట ప్రకటించిన లిస్ట్‌లో లేని ఈ ఆటగాళ్లు ఇప్పుడు వేలానికి అర్హులయ్యారు.
Details
ఫైనల్ లిస్టులో 35 మందికి అవకాశం
వీరిలో ముఖ్యంగా దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ పేరు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రత్యేక అభ్యర్థన మేరకే డికాక్‌తో పాటు ఈ 35 మందికి ఫైనల్ లిస్ట్‌లో స్థానం దక్కినట్లు సమాచారం. డికాక్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేటగిరీలో మూడవ లాట్‌లో చోటు ఇచ్చారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం—డికాక్ ఈసారి తన బేస్ ధరను 50 శాతం తగ్గించుకున్నాడు. గత సీజన్‌లతో పోలిస్తే, ఈ వేలానికి అతను కేవలం రూ. 1 కోటి బేస్ ప్రైస్‌గా నిర్ణయించుకోవడం విశేషంగా మారింది.
Details
డిసెంబర్ 16న ప్రారంభం
కొత్తగా చేరిన 35 మంది ఆటగాళ్లలో డికాక్‌తో పాటు శ్రీలంక క్రికెటర్లు త్రివీన్ మాథ్యూ, బినూరా ఫెర్నాండో, కుసాల్ పెరీరా, డ్యూనిత్ వెలాలగే వంటి పేర్లు కూడా ఉండటం వేలానికి మరింత ఉత్సుకతను తెచ్చింది. ఐపీఎల్ 2026 వేలం అబుదాబిలోని ఎతిహాద్ అరేనా వేదికగా జరగనుంది. డిసెంబర్ 16న, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు వేలం ప్రారంభమవుతుంది. బీసీసీఐ పంపిన సమాచారం ప్రకారం, వేలం మొదట క్యాప్డ్ ఆటగాళ్లతో (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు) ప్రారంభమై, అనంతరం అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై బిడ్డింగ్ జరుగుతుంది.