Shafali Verma: అద్భుత ఫామ్ లో షెఫాలీ వర్మ.. 75 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు బద్దలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్‌లో యువ సంచలనం షెఫాలి వర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తవగా, వాటిలో మూడు హాఫ్ సెంచరీలతో ఆమె బ్యాట్ ఊపిరిపోస్తోంది. మంగళవారం తిరువనంతపురంలో జరగనున్న ఐదో, చివరి టీ20లో కూడా షెఫాలి ఇదే జోరు కొనసాగిస్తే ఓ అరుదైన ప్రపంచ రికార్డు ఆమె ఖాతాలో చేరనుంది. ఈ సిరీస్‌లో షెఫాలి ఇప్పటివరకు 236 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో కేవలం 9 పరుగులకే ఔటైనప్పటికీ, ఆ తర్వాత ఆమె పూర్తిగా గేర్ మార్చింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 69*, 79*, 79* పరుగులతో అర్ధ శతకాలు బాదుతూ లంక బౌలర్లపై విరుచుకుపడింది.
Details
ఆరో ర్యాంకులో షెఫాలి వర్మ
ఇక మరో 75 పరుగులు చేస్తే మహిళల అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షెఫాలి కొత్త చరిత్ర సృష్టించనుంది. ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ (310 పరుగులు) పేరిట ఉంది. ఇదిలా ఉండగా, ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా షెఫాలి వర్మ భారీగా లాభపడింది. నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకుంది. మరోవైపు స్మృతి మంధాన మూడో స్థానంలో తన స్థానాన్ని నిలుపుకుంది. యువ వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 20వ ర్యాంక్‌లో నిలిచింది. బౌలర్ల విభాగంలోనూ భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు.
Details
ఆరో స్థానానికి రేణుకా సింగ్
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో నాలుగు వికెట్లు తీసిన రేణుకా సింగ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. అదే విధంగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసిన శ్రీచరణి ఏకంగా 17 స్థానాలు జంప్ చేసి ఓవరాల్‌గా 52వ ర్యాంక్‌ను దక్కించుకుంది. మొత్తంగా శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటివరకు అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత జట్టే విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగనుంది. షెఫాలి బ్యాట్ నుంచి వచ్చే మరో మెరుపు ఇన్నింగ్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.