Page Loader
షఫాలి వర్మ సూపర్ బ్యాటింగ్
34 బంతుల్లోనే 78 పరుగులు చేసిన షఫాలి వర్మ

షఫాలి వర్మ సూపర్ బ్యాటింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2023
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీపీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా మహిళా కెప్టెన్ షఫాలీ వర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో 34 బంతుల్లో 78 పరుగులు చేసి సంచలనం సృష్టించింది. ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సారథి షఫాలీ వర్మ మరో సంచలనం ఆడింది. దీంతో ఎనిమిది ఓవర్లలోనే స్కోరు 100 పరుగుల స్కోరును దాటింది. UAE బౌలర్లపై షఫాలి వర్మ బౌండర్ల వర్షం కురిపించి సత్తా చాటింది.

షఫాలి వర్మ

26 బంతుల్లోనే అర్ధ సెంచరీ

బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌లో ఈ మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు షఫాలీ, శ్వేతా సెహ్రావత్ 111 పరుగులు జోడించారు. షఫాలీ 26 బంతుల్లోనే తన అర్ధ సెంచరీ చేసి దూకుడుగా ఆడింది. చివరికి ఆమె ఇందుజా నందకుమార్ బౌలింగ్‌లో ఆవుటైంది. ప్రస్తుతం మహిళల టీ20 ర్యాకింగ్‌లో షఫాలి వర్మ ఆరో స్థానంలో నిలిచింది. ఆమె 2019లో దక్షిణాఫ్రికాపై WT20I అరంగేట్రం చేసింది. ఇంతవరకు 51 మ్యాచ్‌లు ఆడి 1,231 పరుగులు చేసింది. ఇందులో ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి.