Page Loader
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కి కొత్త పదవి
షాహిద్ ఆఫ్రిది

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కి కొత్త పదవి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 24, 2022
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే నాజామ్ సేథీ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని నియమించింది. ఇందులో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి చోటు దక్కింది. ప్రస్తుతం పీసీబీ మేనేజ్ మెంట్ కమిటీ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిని పురుషుల జాతీయ సెలక్షన్ కమిటీకి తాత్కాలిక ఛైర్మన్‌గా శనివారం ప్రకటించింది. మాజీ క్రికెటర్లు అబ్దుల్ రజాక్, ఇఫ్తికర్ అంజుమ్ హరూన్ రషీద్ కూడా ఈ ప్యానెల్లో ఉన్నట్లు పిసిబి తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. షాహిద్ అఫ్రిది ఎలాంటి భయం లేకుండా ఆడిన అటాకింగ్ క్రికెటర్.. దాదాపు 20 సంవత్సరాలు క్రికెట్ అనుభవం కలిగి ఉన్నాడు.

షాహిద్ ఆప్రిది

షాహిద్ ఆప్రిది ట్రాక్ రికార్డు

పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో షాహిద్ అఫ్రిది ఎన్నో రికార్డులు సృష్టించాడు. 2009లో టీ20 ప్రపంచకప్‌ను అఫ్రిది సారథ్యంలో పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ తరపున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 ఆడి చరిత్ర సృష్టించాడు. మరో పాక్ ఆటగాడు అబ్దుల్ రజాక్ జట్టు కోసం 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. మాజీ పేసర్ రావ్ ఇఫ్తికర్ అంజుమ్ 62 వన్డే మ్యాచ్‌లు ఆడిన 77 వికెట్లు తీశాడు. 14మంది కొత్త సభ్యులతో కూడిన కమిటీ షాహీద్ ఆఫ్రిది నాయకత్వం వహించనున్నారు. ప్రస్తుతం కొత్త బోర్డు ఆఫ్ గవర్నర్‌ను ఏర్పాటు చేయడానికి 120 రోజులు సమయం ఇచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాకిస్థాన్ పురుషుల తాత్కాలిక సెలక్టర్‌గా షాహిద్ ఆఫ్రిది