హడలెత్తించిన మావి.. భారత్ థ్రిలింగ్ విన్
కొత్త ఏడాదిని భారత్ విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన టీ20లో బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు రాణించారు. డెబ్యూ బౌలర్ శివమ్‌మావి లంక బ్యాటర్లకు చుక్కులు చూపించాడు. నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి.. నాలుగు వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. అఖరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠను రేపింది. భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దీపక్ (23 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఇషాన్ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ (20 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
అఖరి బంతి వరకు ఉత్కంఠ
అనంతరం లంక 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షనక (27 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇషాన్ తొలి ఓవర్ల ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టడంతో మ్యాచ్ ఇన్నింగ్స్ జోరుగా ప్రారంభమైంది. పవర్ ప్లేలో గిల్(7), సూర్యకుమార్ (7), సామ్సన్ (5) పరుగులు చేసి వెనుతిరిగారు. దీపక్ హుడా, అక్షర్ పటేల్ శ్రీలంక బౌలర్లను ఎదుర్కొని భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. శానక, హసరంగ (21) అనూహ్యంగా భారత బౌలర్లపై ఎదురుదాడి చేశారు. హసరం, శనక ఔట్ కావడంతో భారత్‌కు ఉపశమనం కలిగింది. లంకకు చివర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా.. 11 పరుగులు వచ్చాయి. దీంతో లంక రెండుపరుగుల తేడాతో ఓటమిపాలైంది.