
Shoaib Akhtar: పాక్‌పై గెలుపు.. టీమిండియాను అభినందించిన షోయబ్ అక్తర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్‌కు క్రీడా వేదికపై బుద్ధి చెప్పినట్టు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ టీమ్‌ఇండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, రాజకీయాలను క్రీడలకు ముడిపెట్టవద్దని సూచించాడు. ఆయన భారత జట్టు విజయాన్ని అభినందిస్తూ, "నాకు మాటలు రావడం లేదు. ఇలాంటి పరిస్థితి చూడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీమ్‌ఇండియాకు హ్యాట్సాఫ్. కానీ రాజకీయం చేయకుండా, క్రీడను ముద్రింపుగా ఉంచాలి. ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి. కరచాలనం చేయడం బాగుండేది, కానీ మనం ముందుకు సాగాలని వ్యాఖ్యానించాడు.
Details
షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై పాక్ అసంతృప్తి
అంతేకాదు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ముందు భారత క్రికెటర్లు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై పాకిస్థాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకుని భారత అభిమానులు పాక్‌తో మ్యాచ్ ఆడకూడదని డిమాండ్ చేసిన నేపథ్యంలో, ICC, ACC నిబంధనలను గౌరవిస్తూ టీమ్‌ఇండియా మ్యాచ్ ఆడింది. ఈ విషయాన్ని సూర్యకుమార్ కూడా "మేము కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చామని స్పష్టంగా చెప్పారు. పాక్ బ్యాటింగ్‌పై మాత్రం మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ అసహనాన్ని వ్యక్తం చేశాడు. కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో పాక్ బ్యాటర్లు తడబాటుకి గురయి సరైన రీతిలో స్పందించలేదని తెలిపాడు.