Page Loader
ఆప్ఘనిస్తాన్ విజయంపై షోయబ్ ఆక్తర్ హర్షం
ఆప్ఘన్ విజయంపై స్పందించిన అక్తర్

ఆప్ఘనిస్తాన్ విజయంపై షోయబ్ ఆక్తర్ హర్షం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2023
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ జట్టుపై ఆప్ఘనిస్తాన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మొదటి, రెండో టీ20ల్లో పాక్‌ను ఆప్ఘన్ చిత్తు చేసింది. దీంతో 2-0తో టీ20 సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆప్ఘన్ కైవసం చేసుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. ఆప్ఘనిస్తాన్ విజయంతో తాను సంతోషంగా ఉన్నానని, భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆప్ఘన్ మెరుగ్గా రాణించాలని షోయబ్ అక్తర్ వారికి మద్దతు ఇచ్చాడు. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షోయబ్ అక్తర్ వెల్లడించారు. తమ పఠాన్ సోదరులు గెలిచినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అతను తెలియజేశారు.

షోయబ్ అక్తర్

ఆప్ఘన్ స్పిన్నర్లు బాగా రాణించారు

ఆప్ఘనిస్తాన్ బలహీనమైన జట్టు అని, అయితే స్పిన్నర్లు గొప్పగా రాణించారని, ముఖ్యంగా నబీ బౌలింగ్ బాగా చేశారని షోయబ్ అక్తర్ తెలియజేశారు. భారత్‌లో జరిగే వన్డే వరల్డ కప్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఆప్ఘన్ నిలుస్తుందని చెప్పారు. అనంతరం పాక్ ఓటమిపై షోయబ్ అక్తర్ స్పందించారు. మూడో టీ20ల్లో పాకిస్థాన్ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆఫ్ఘన్ విజయం సాధించిన తర్వాత.. తనకు ఆప్ఘనిస్తాన్ నుండి చాలామంది స్నేహితులు ఫోన్ చేశారని, తాను కాబూల్ కు రావాలనుకుంటున్నానని అక్తర్ స్పష్టం చేశారు. రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.