PAK vs AFG : పాక్‌ను మళ్లీ చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సిరీస్ కైవసం
పాక్‌తో జరిగిన తొలి టీ20ల్లో విజయం సాధించిన ఆప్ఘన్.. రెండో టీ20ల్లోనూ సత్తా చాటింది. ఏడు వికెట్ల తేడాతో ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది. దీంతో పాక్‌పై తొలి టీ20 సిరీస్‌ను ఆప్ఘన్ కైవసం చేసుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. పాక్ ఓ దశలో 20/3తో కొట్టుమిట్టాడుతుండగా, ఇమాద్ వసీమ్, కెప్టెన్ షాదాబ్ ఖాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇమాద్ వసీమ్ (64*), షాదాబ్ ఖాన్ 32 పరుగులు చేయడంతో పాక్‌కు గౌరవప్రదమైన స్కోరు చేసింది. వసీమ్‌కు టీ20ల్లో ఇది మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం.
రాణించిన రెహ్మానుల్లా గుర్బాజ్
లక్ష్య చేధనకు దిగిన ఆప్ఘన్ 3 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఆఫ్ఘానిస్తాన్ విజయంలో రెహ్మానుల్లా గుర్బాజ్ 49 బంతుల్లో 44 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిడిలార్డర్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్(38) కూడా అద్భుతంగా రాణించాడు. ఆప్ఘనిస్తాన్ బ్యాటర్లు వెంటవెంటనే ఔట్ కావడంతో పాక్ విజయం వైపు మళ్లింది. చివర్లో నజీముల్లా 12 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సాయంతో 23 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. పాక్ బౌలర్లలో జమాన్ ఖాన్, ఇహ్సానుల్లా తలా ఓ వికెట్ సాధించారు.