Page Loader
రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..?
టీ20ల్లో పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ తొలి విజయాన్ని నమోదు చేసింది

రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 25, 2023
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆప్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. టీ20ల్లో పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్తాన్ విజయం సాధించడం ఇదే తొలిసారి. అయితే మ్యాచ్‌లో ఓడిపోయిన పాక్.. రెండో టీ20ల్లోనే ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మొదటి టీ20 మ్యాచ్‌లో నెగ్గిన ఆప్ఘన్ అదే ఊపుతో టీ20 సిరీస్ ను నెగ్గి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. రెండో మ్యాచ్ మార్చి 26న షార్జా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ వేదికపై ఆడిన 40 మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 22సార్లు గెలుపొందాయి. ఇప్పటి వరకు ఇరు జట్లు నాలుగు టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో పాకిస్థాన్‌కు మెరుగైన రికార్డు ఉంది. షార్జాలో కూడా ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ 2-1 గెలిచిన విషయం తెలిసిందే.

ఆప్ఘనిస్తాన్

ఇరు జట్లలోని సభ్యులు

ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రషీద్ (127) నిలిచాడు. ఈ సిరీస్‌లో అతను టిమ్ సౌథీ (134)ను అధిగమించాడు. ఆఫ్ఘనిస్తాన్: నజీబుల్లా జద్రాన్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, రహ్మానుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్(సి), ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్, గుల్బాదిన్ నక్. పాకిస్థాన్ : సైమ్ అయూబ్, మహ్మద్ హరీస్, అబ్దుల్లా షఫీక్, తయ్యబ్ తాహిర్, ఆజం ఖాన్, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, నసీమ్ షా, జమాన్ ఖాన్, ఇహ్సానుల్లా.