Page Loader
అరుదైన ఘనతను సాధించిన అఫ్గాన్ బౌలర్
టీ20ల్లో 50 వికెట్లు పడగొట్టిన ఆఫ్ఘన్ బౌలర్ ముబీర్

అరుదైన ఘనతను సాధించిన అఫ్గాన్ బౌలర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 25, 2023
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20ల్లో ఆప్ఘనిస్తాన్ బౌలర్ ముబీర్ ఉర్ రెహ్మాన్ అరుదైన ఘనతను సాధించారు. శుక్రవారం షార్జా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీసి, టీ20ల్లో 50 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచారు. దీంతో ఆఫ్టన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి కెప్టెన్ షాదాబ్ ఖాన్ (12), ఆజం ఖాన్‌ను ముబీర్ పెవిలియానికి పంపాడు. నబీ, ఫరుఖీలకు తలో రెండు వికెట్లు దక్కాయి. దీంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 92/9 పరుగులు మాత్రమే చేసింది.

ఆప్ఘనిస్తాన్

అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్‌కు తొలి విజయం

ముజీబ్ 39 టీ20ల్లో 17.69 సగటుతో 51 వికెట్లు పడగొట్టాడు. ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లలో రషీద్ ఖాన్ (125), మహ్మద్ నబీ (86) వికెట్లు తీసి అతని కంటే ముందు స్థానంలో ఉన్నారు. ఐసీసీ T20 ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన 10 మంది బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ కూడా ఉండడం విశేషం. అతను 2021 ఈవెంట్‌లో స్కాట్లాండ్‌పై (5/20)తో విజృంభించిన విషయం తెలిసిందే. 93 పరుగుల ఛేదనకు దిగిన రషీద్ ఖాన్ సేన 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్ 1-0 ఆధిక్యంలో ఉంది.