Page Loader
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఆప్ఘనిస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘాన్ విక్టరీ
పాకిస్థాన్‌పై ఆప్ఘన్ గ్రాండ్ విక్టరీ

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఆప్ఘనిస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘాన్ విక్టరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 25, 2023
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ జట్టుకు ఆప్ఘనిస్తాన్ షాకిచ్చింది. శుక్రవారం షార్జా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ ఓడించింది. ఆఫ్ఘన్ బౌలింగ్ ధాటికి పాక్ బ్యాటర్లు విలవిలలాడారు. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 92 పరుగులను మాత్రమే చేశారు. ఒకానొకదశలో 65 పరుగులకు ఏడు వికెట్లను కోల్పోయి పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. పాకిస్థాన్‌ను ఇమాద్ వసీమ్, కెప్టెన్ షాబాద్ ఖాన్ కలిసి 90 పరుగులు ధాటించారు. 18 పరుగులతో ఇమాద్ వసీమ్ టాప్ స్కోరర్‌గా నిలవడం గమనార్హం.

ఆఫ్ఘనిస్తాన్

విజృంభించిన ఆప్ఘన్ బౌలర్లు

ఆఫ్టనిస్తాన్ బౌలర్లలో ముజీబ్ నాలుగు వేసి 9 రన్స్ ఇచ్చి రెండు వికెట్లను పడగొట్టాడు. నబీ, ఫరుఖీలకు తలో రెండు వికెట్లు దక్కాయి. లక్ష్య చేధనకు ఆఫ్ఘన్ నాలుగు వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. నబీ 38 పరుగులతో బ్యాటింగ్‌లో రాణించి, ఆప్ఘన్‌కు విక్టరీని అందించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఇషానుల్లా రెండు వికెట్లు, నషీమ్ షా, వసీం తలా ఒకో వికెట్ తీశారు. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆప్ఘనిస్తాన్ 1-0 తేడాతో అధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో బాబర్ ఆజాంతో పాటు పలువురు సీనియర్ ప్లేయర్లకు పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.