వరల్డ్ కప్‌లో ఇండియాపై పగ తీర్చుకుంటాం : షోయబ్ అక్తర్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాతో సహా అన్ని జట్లు గట్టిగా రెడీ అవుతున్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ టోర్నీ టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఈ మెగా టోర్నీ విషయంలో ఇండియా, పాకిస్థాన్ మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
మొదట ఆసియాకప్ పాకిస్థాన్‌లో జరగనుంది. పాకిస్థాన్‌కు టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లదని, ఆసియా కప్ ను వేరే చోటికి మార్చాలని బీసీసీఐ గతంలో తేల్చి చెప్పింది. అలా చేస్తే ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు పాకిస్థాన్ రాదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింంది.
ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా, పాకిస్థాన్ టీమ్స్ తలపడాలనీ షోయబ్ అక్తర్ ఆకాంక్షించాడు.
ఇండియా
ఫైనల్లో ఇండియా-పాక్ తలపడాలి
ఇండియా, పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్లోనే కాదని.. వరల్డ్ కప్ ఫైనల్లోనూ తలపడతాయని, ఆసియా కప్ కోసం పాకిస్థాన్ కు ఇండియా వస్తుందని, వరల్డ్ కప్ కోసం ఇండియాకు పాకిస్థాన్ వెళుతుందని, ఇండియా, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మెరుగుపడతాయని షోయబ్ అక్తర్ అశాభావం వ్యక్తం చేశారు.
2011 సెమీఫైనల్లో పాక్ ఓడించి టీమిండియా ఫైనల్ కు చేరిది. ఆ తర్వాత ట్రోఫీని నెగ్గింది. అయితే అప్పటి పరాభవానికి ఇప్పుడు పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకోవాలని అక్తర్ సూచించాడు.
ఇండియాలో వాంఖెడే లేదా అహ్మదాబాద్ ఎక్కడ అయితే అక్కడ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా, పాకిస్థాన్ తలపడితే ఆ ఫైనల్ మ్యాచ్ చూడటానికి తాను ప్రయత్నిస్తానని చెప్పారు.