వికెట్ల మధ్య ధోని కంటే ఫాస్టెస్ట్ రన్నర్ ఏబీ డివిలియర్స్ : విరాట్ కోహ్లీ
మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే బ్యాటర్లలో టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ముందు స్థానంలో ఉంటాడు. సాధారణంగా మనిషి గంటకు 12-13 కిమీ వేగంగా పరిగెత్తగలడు. కానీ విరాట్ కోహ్లీ 24-25 కిమీ వేగంతో పరిగెత్తే సత్తా ఉంది. 2019 వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ కోహ్లీ ఈ వేగాన్ని నమోదు చేశాడు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ నిర్వహిస్తున్న 360 షో కి గెస్ట్ గా విరాట్ కోహ్లీ హజరయ్యాడు. ఈ షోలో విరాట్ కోహ్లీకి ఇప్పటివరకు మీరు చూసిన వారిలో ఎవరు వికెట్ల మధ్య ఫాస్టెస్ట్ రన్నర్ అని ఓ విలేకరి అడగ్గా.. దానికి కోహ్లీ సమాధానం చెప్పాడు.
ఫాస్టెస్ట్ రన్నర్ ఏబీ డివిలియర్స్ అని చెప్పిన కోహ్లీ
దానికి అంతా మహేంద్రసింగ్ ధోని పేరును కోహ్లీ చెప్తాడని అంతా భావించారు. ఎందుకంటే విరాట్ కోహ్లీతో సమానంగా పరిగెత్తే సత్తా ధోనికి మాత్రమే ఉంది. కానీ కోహ్లీమాత్రం ఆ ప్రశ్నకి ఏబీ డివిలియర్స్ అని సమాధానమిచ్చాడు. అయితే సెకండ్ ప్లేస్ మాత్రం ధోనికి ఇచ్చాడు. తనతో కలిసి వికెట్ల మధ్య పరుగెత్తిన వారిలో ఫాస్టెస్ట్ రన్నర్ ఏబీ డివిలియర్స్ అని, అయితే ధోని తనను బాగా అర్ధం చేసుకుంటారని, తమ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగుటుందని కోహ్లీ చెప్పాడు. ముఖ్యంగా ధోని, ఏబీ డివిలియర్స్ తో కలిసి బ్యాటింగ్ చేసేటప్పుడు రన్ కోసం తాను పిలవాల్సిన అవసరం లేదని, వాళ్లే అర్ధం చేసుకొని రన్ కి వచ్చేవారని తెలియజేశారు.