ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ను ఇస్తుంది. మ్యాచ్ ఎప్పుడు జరిగినా వాతావరణం ఇరుపక్షాల మధ్య హీట్‌గా ఉంటుంది. అయితే స్లెడ్జింగ్ చేయడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఎప్పుడు ముందు ఉంటారు.
ప్రత్యర్థి బ్యాటర్ల ఏకాగ్రతను చెడగొట్టేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలను తరుచూ ఆసీసీ ఆటగాళ్లు చేస్తుంటారు. అయితే ఈ విషయంపై తాజాగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్పందించారు.
ప్రత్యర్థులపై స్లెడ్జింగ్ చేయడంలో ఆసీసీ ఆటగాళ్లు చాలా మెరుగుపడ్డారని, ఐపీఎల్ కారణంగానే ఇది సాధ్యమైందని కోహ్లీ స్పష్టం చేశారు. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తో కలిసిన ఓ ఇంటర్య్వూలో కోహ్లీ ప్రసంగించాడు.
కోహ్లీ
ఆసీస్ ఆటగాళ్లలో చాలా మార్పు వచ్చింది : కోహ్లీ
ఐపీఎల్ చాలా విషయాల్లో అందరిలో మార్పు తీసుకొచ్చిందని, క్రికెట్లో పోటీతత్వం మాత్రమే ఉందని, ఇతరుల కించపరిచేలా మాట్లాడటం లాంటి విషయాల్లో చాలా మార్పు వచ్చిందని, స్లెడ్జింగ్ ను ఇప్పుడు అసహ్యించుకోవాల్సిన అవసరం లేదని కోహ్లీ తెలిపాడు.
ముఖ్యంగా ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ఆటగాళ్ల మధ్య పోటీ అనేది మైదానానికే పరిమితమైందని కోహ్లీ అనడం విశేషం. ఆటలో ఇరు పక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చాలా వరకు తగ్గాయని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
నేడు చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ మూడో వన్డేలో తలపడనుంది.