రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ వంద సెంచరీలు చేస్తాడు: ఆసీస్ ఆల్ రౌండర్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ తో జరిగిన చివరి టెస్టులో సెంచరీ చేసి కోహ్లీ అదరగొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీల సంఖ్య 75కి చేరింది. అయితే అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత రెండో స్థానంలో కోహ్లీ ఉన్నాడు. 2019లో టెస్టుల్లో చివరి సెంచరీ చేసిన కోహ్లి దాదాపు 1200 రోజుల తర్వాత మూడెంకల స్కోరును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు సాధించే కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే ఉందని షేన్ వాట్సన్ పేర్కొన్నారు.
మరో అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అతడి రికార్డులే చెబుతాయని, భవిష్యత్తులో ఎవరికి సాధ్యం కానీ ఎన్నో ఘనతల్ని కోహ్లీ అందుకుంటాడని, సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడే సత్తా విరాట్ కోహ్లీలో ఉందని షేన్ వాట్సన్ వెల్లడించారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 23 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 59.95 సగటుతో 1,199 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై రెండవ అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన బ్రియాన్ లారా (4,714)ను కోహ్లీ అధిగమించారు ఇంటర్నేషనల్ వన్డేల్లో 13,000 పరుగుల మైలురాయి దాటుకోవడానికి విరాట్ కోహ్లీ 191 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 262 వన్డేల్లో 12,809 పరుగులు చేశాడు