LOADING...
Rishabh Pant: సెంచరీతో మెరిసిన రిషబ్ పంత్‌కు షాక్.. రూ.30లక్షలు జరిమానా!
సెంచరీతో మెరిసిన రిషబ్ పంత్‌కు షాక్.. రూ.30లక్షలు జరిమానా!

Rishabh Pant: సెంచరీతో మెరిసిన రిషబ్ పంత్‌కు షాక్.. రూ.30లక్షలు జరిమానా!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు భారీ జరిమానా పడింది. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు నిబంధనలకు విరుద్ధంగా స్లో ఓవర్‌ రేట్‌తో బౌలింగ్‌ చేసింది. ఈ నిబంధన ఉల్లంఘనపై ఐపీఎల్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్‌ పంత్‌కు రూ.30 లక్షల జరిమానా విధించారు. ఇది లక్నో జట్టు ప్రవర్తనా నియమావళిని ఈ సీజన్‌లో మూడోసారి ఉల్లంఘించిన ఘటనగా ఐపీఎల్‌ పేర్కొంది.

Details

మ్యాచ్ ఫీజులో 50శాతం కోత

దీంతో జట్టులోని ఇతర ఆటగాళ్లకు రూ.12 లక్షల చొప్పున లేదా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించనున్నారు. ఈ లోపల 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' సైతం ఉండటం గమనార్హం. ఆర్సీబీతో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్ అద్భుత సెంచరీ సాధించినా లక్నో జట్టుకు విజయం అందించలేకపోయాడు. అతను 61 బంతుల్లో 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయినప్పటికీ ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్‌-1కు ప్రవేశించింది. గురువారం ఆ జట్టు చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.