Jasprit Bumrah: టీమిండియాకు షాక్? స్కానింగ్‌కు వెళ్లిన భారత కెప్టెన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ అభిమానులను భారత కెప్టెన్ జస్పిత్ బుమ్రా పరిస్థితి ఆందోళనకు గురిచేస్తోంది.
సిడ్నీ టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా, బుమ్రా మైదానం విడిచి వెళ్లాడు. మెడికల్ సిబ్బందితో కలిసి స్కానింగ్‌కు వెళ్లినట్లు సమాచారం.
కీలకమైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు. అయితే గాయం ఉన్నట్లు తేలితే ఇది టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరోవైపు స్కానింగ్‌లో ఎలాంటి సమస్యలూ లేవని తేలితే మాత్రం అభిమానులకు ఊరట లభించనుంది.
Details
బుమ్రా
ఈ సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్‌లో బుమ్రా గైర్హాజరైతే, భారత్‌కు కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. బుమ్రా గైర్హాజరైన పరిస్థితుల్లో జట్టును నడిపించే బాధ్యతను మేనేజ్‌మెంట్ విరాట్ కోహ్లీకి అప్పగించింది.
బుమ్రా స్కానింగ్ ఫలితాలపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇబ్బంది లేకుండా ఫలితాలు వస్తే టీమిండియాకు శుభవార్తగా నిలవనుంది.