LOADING...
Prithvi Shaw: 'సర్ఫరాజ్ ఎలా స్లిమ్ అయ్యాడో చూపించండి'.. పృథ్వీ షాపై కెవిన్ పీటర్సన్ ఘాటు వ్యాఖ్యలు!
'సర్ఫరాజ్ ఎలా స్లిమ్ అయ్యాడో చూపించండి' - పృథ్వీ షాపై కెవిన్ పీటర్సన్ ఘాటు వ్యాఖ్యలు!

Prithvi Shaw: 'సర్ఫరాజ్ ఎలా స్లిమ్ అయ్యాడో చూపించండి'.. పృథ్వీ షాపై కెవిన్ పీటర్సన్ ఘాటు వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా ప్రస్తుతం జాతీయ జట్టులో చోటు కోల్పోయిన దశలో ఉన్నాడు. కెరీర్ ఆరంభంలోనే ఉజ్వల ఆటతీరుతో ఆకట్టుకున్న అతడు ఇప్పుడు ఫిట్‌నెస్ లోపం, పేలవమైన ఫామ్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ముంబై జట్టులో సైతం స్థిరంగా ఆడలేకపోతున్న షాకు ఐపీఎల్ 2025 మెగా వేలంలో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఏ ఫ్రాంఛైజీ ఆయనపై ఆసక్తి చూపకపోవడం అతడి ప్రస్తుత పరిస్థితిని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించారు. షా శరీర ధృఢత, ఫిట్‌నెస్‌పై అసహనం వ్యక్తం చేస్తూ, అతనికి స్ఫూర్తిగా ఉండేలా సర్ఫరాజ్ ఖాన్‌ను ఉదాహరణగా చూపించారు.

Details

రెండు నెలల్లో 17 కిలోల బరువు తగ్గడం అభినందనీయం

కొంతకాలం క్రితం వరకు బొద్దుగా ఉన్న సర్ఫరాజ్ ఖాన్ త‌న శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడని, రెండు నెలల్లోనే 17 కిలోల బరువు తగ్గాడని పీటర్సన్ గుర్తు చేశారు. ఇప్పుడు అతడు స్లిమ్‌గా మారిపోయి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడని చెప్పారు. సర్ఫరాజ్‌ ఫిట్‌నెస్ మార్పుపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలపై స్పందించిన పీటర్సన్, "సర్ఫరాజ్ ఖాన్ సూపర్. మంచి ప్రయత్నం చేశావు. అభినందనలు. ఇప్పుడు నీవు చాలా స్లిమ్‌గా ఉన్నావు. ఇది మైదానంలో నీ ప్రదర్శనకు ఉపకరిస్తుంది.

Details

ఇదే మార్గాన్ని పృథ్వీషా అనుసరించాలి

జాతీయ జట్టుకు చేరాలన్న సంకల్పంతో నీవు చేస్తున్న కృషి అద్భుతం. ఇదే మార్గాన్ని పృథ్వీ షా కూడా అనుసరించాలి. సర్ఫరాజ్ మారిన తీరును షాకు చూపించండి. ఒకసారి ఆలోచించు పృథ్వీ.. దృఢమైన శరీరంలో దృఢమైన మనసు ఉంటుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కు సర్ఫరాజ్ కొత్త ఫొటోలు జతచేసిన పీటర్సన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. షా పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పీటర్సన్ సూచనకు మద్దతుగా స్పందనలు వస్తున్నాయి.