LOADING...
WPL: 5 వికెట్లతో చెలరేగిన శ్రేయాంక పాటిల్..గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
5 వికెట్లతో చెలరేగిన శ్రేయాంక పాటిల్..గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం

WPL: 5 వికెట్లతో చెలరేగిన శ్రేయాంక పాటిల్..గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2026
11:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్పష్టమైన ఆధిపత్యంతో గెలుపొందింది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జట్టు 18.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్‌ బ్యాటర్లలో బెత్‌ మూనీ 27 పరుగులు చేయగా, భారతి ఫుల్మలి 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. కష్వీ గౌతమ్‌ 18, కనిక ఆహుజా 16, తనూజ 21 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు ఆర్సీబీ బౌలర్ల ఒత్తిడిని తట్టుకోలేక త్వరగా పెవిలియన్‌కు చేరారు.

Details

వరుసగా మూడో విజయం

బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ అద్భుత ప్రదర్శనతో ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను పూర్తిగా ఆర్సీబీ వైపునకు తిప్పింది. లారెన్‌ బెల్‌ మూడు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించగా, అరుంధతి రెడ్డి, నదైన్‌ డీ క్లర్క్‌ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా మూడో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో తన స్థితిని మరింత బలోపేతం చేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్సీబీ గెలుపు

Advertisement