India vs Netherlands: శ్రేయాస్, కేెఎల్ రాహుల్ సెంచరీల మోత.. నెదర్లాండ్స్ టార్గెట్ 411 పరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కప్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు.
ఆకాశమే హద్దుగా నెదర్లాండ్స్ బౌలర్లను హడలెత్తించారు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సిక్సర్ల మోత మోగించారు.
ఈ ఇద్దరి అద్భుతమైన సెంచరీలతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.
నెదర్లాండ్స్‌కు టీమిండియా 411 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 54 బంతుల్లో 61 పరుగులు, విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 51 పరుగులు, గిల్ 32 బంతుల్లో 51 పరుగులతో రాణించారు.
టీమిండియా బ్యాటర్ల దూకుడును నెదర్లాండ్ బౌలర్లు ఏ స్థాయిలోనూ అడ్డుకోలేకపోయారు.
నెదర్లాండ్స్ బౌలర్లో లీడ్స్ 2 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెదర్లాండ్స్ టార్గెట్ 411 పరుగులు
ICC Men’s Cricket World Cup | Centuries from Shreyas Iyer and KL Rahul guide India to 410/4 in 50 overs against Netherlands pic.twitter.com/YldpREonTt
— ANI (@ANI) November 12, 2023