Loading...
Shreyas Iyer: వీవీఎస్ లక్ష్మణ్‌ స్ఫూర్తితో సిరీస్ గెలిచాం: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
వీవీఎస్ లక్ష్మణ్‌ స్ఫూర్తితో సిరీస్ గెలిచాం: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer: వీవీఎస్ లక్ష్మణ్‌ స్ఫూర్తితో సిరీస్ గెలిచాం: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
06:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరుసగా రెండు ద్వైపాక్షిక సిరీస్‌లలో పరాజయాలు ఎదుర్కొన్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జింబాబ్వే పర్యటన భారీ ఊరటనిచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు ప్రత్యర్థిని పూర్తిగా ఆధిపత్యంలో ఉంచి క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో కెప్టెన్‌గా అయ్యర్‌కు ఎట్టకేలకు తొలి సిరీస్ విజయం దక్కింది.అంతకుముందు ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌లపై జరిగిన సిరీస్‌లలో భారత్ ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌లో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు సంజు శాంసన్‌,అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్ సింగ్‌,హర్షిత్ రాణా జట్టుకు అందుబాటులో లేకపోయినా,తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో యువ భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. సిరీస్ విజయం అనంతరం లక్ష్మణ్‌కు శ్రేయస్ అయ్యర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.

వివరాలు 

వీవీఎస్ సర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: అయ్యర్

"నిజాయతీగా చెప్పాలంటే ఈ సిరీస్‌లో మేం వదిలేసిన కొన్ని క్యాచ్‌లు తప్పితే, మిగతా అన్ని విభాగాల్లో అత్యుత్తమంగా ఆడామని భావిస్తున్నాను. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది కూడా ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా వీవీఎస్ సర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన మమ్మల్ని నిరంతరం ప్రోత్సహిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ప్రతి మ్యాచ్‌కు ముందు ఆయన చెప్పిన విషయాలు మైదానంలో నిజమవుతున్నాయని అనిపించింది. పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలో ఆయన మాకు స్పష్టంగా వివరించారు. అదే మా విజయానికి ప్రధాన కారణమైంది" అని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.

వివరాలు 

శ్రేయస్ కమ్‌బ్యాక్ అద్భుతం: వీవీఎస్ లక్ష్మణ్

సిరీస్ విజయానంతరం వీవీఎస్ లక్ష్మణ్ కూడా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.

"శ్రేయస్ అయ్యర్‌కు అభినందనలు. కెప్టెన్‌గా అతడి ప్రయాణం అంత సులభంగా ప్రారంభం కాలేదు. తొలి రెండు సిరీస్‌ల్లో ఎదురుదెబ్బలు తగిలినా, ఈసారి అద్భుతంగా పుంజుకున్నాడు. జింబాబ్వేతో తొలి మ్యాచ్‌కు ముందు రోజే అతడు జట్టుతో చేరినా, సిరీస్‌ను గెలుస్తామనే పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఇప్పుడు అదే నమ్మకాన్ని ఫలితంగా మార్చాడు" అని పేర్కొన్నాడు.

ADVERTISEMENT

వివరాలు 

శ్రేయస్ కమ్‌బ్యాక్ అద్భుతం: వీవీఎస్ లక్ష్మణ్

ఈ జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారని, ఇంగ్లాండ్ సిరీస్ నుంచి కేవలం నలుగురు లేదా ఐదుగురు మాత్రమే కొనసాగారని లక్ష్మణ్ గుర్తుచేశాడు.

అయినప్పటికీ యువ ఆటగాళ్లను సమన్వయం చేస్తూ, ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతూ శ్రేయస్ సమర్థ నాయకత్వం ప్రదర్శించాడని కొనియాడాడు.

జింబాబ్వేపై భారత్ సాధించిన క్లీన్‌స్వీప్ విజయానికి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పాత్ర ఎంతో కీలకమని లక్ష్మణ్ స్పష్టం చేశాడు.

ADVERTISEMENT