LOADING...
#ViralMoment: షాకింగ్ ఇన్సిడెంట్.. శ్రేయస్ అయ్యర్‎కు గాయం.. గ్రౌండ్‎లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్
గ్రౌండ్‎లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్

#ViralMoment: షాకింగ్ ఇన్సిడెంట్.. శ్రేయస్ అయ్యర్‎కు గాయం.. గ్రౌండ్‎లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
11:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 19లో భాగంగా పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడటం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో రషీద్ ఖాన్ వేసిన 11వ ఓవర్‌లో ఐదో బంతిని ఓపెనర్ కూపర్ కానలీ స్ట్రైట్‌గా బలంగా కొట్టాడు. ఆ బంతి నేరుగా వెళ్లి నాన్-స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అయ్యర్ కుడి చేతి మణికట్టుకు బలంగా తాకింది. దెబ్బ తగిలిన వెంటనే అయ్యర్ తీవ్ర నొప్పితో కిందపడిపోయి క్షణాల పాటు విలవిలాడిపోయాడు.

వివరాలు 

ఫిజియోలు రంగంలోకి.. నొప్పితోనే బ్యాటింగ్

ఘటన వెంటనే పంజాబ్ టీమ్ ఫిజియోలు మైదానంలోకి పరుగెత్తుకుని వచ్చి అయ్యర్‌ను పరీక్షించారు. గాయమైన చోట ఐస్ ప్యాక్‌లు పెట్టి, పెయిన్ రిలీఫ్ స్ప్రే ఉపయోగించారు. తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ అయ్యర్ ధైర్యంగా మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. 18 పరుగుల వద్ద ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయ్యర్ గాయం తీవ్రంగా ఉంటే పంజాబ్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశముంది.

వివరాలు 

మ్యాచ్ ఫలితం.. పంజాబ్ సూపర్ విజయం

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 39, జొస్ బట్లర్ 38, ఫిలిప్స్ 25 పరుగులతో రాణించారు. బౌలింగ్‌లో విజయ్ వైశాఖ్ మూడు వికెట్లు తీసి మెరిపించగా, యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు, యాన్సెన్ ఒక వికెట్ సాధించారు. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ సమయానికి ఛేదించి టోర్నీని విజయంతో ప్రారంభించింది.

Advertisement