Shreyas Iyer : సిడ్నీలో చికిత్స పొందుతున్న శ్రేయస్ అయ్యర్.. ఖర్చులు ఎవరు భరిస్తారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయంతో సిడ్నీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఆయన ఎడమ పక్కటెముక కింద తీవ్రంగా గాయపడ్డారు. ఈ గాయం తీవ్రత కారణంగా వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. సిడ్నీలో చికిత్స కొనసాగుతున్న ఆయన తాజాగా ఐసీయూ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.అయితే ఈ చికిత్సకు అయ్యర్ స్వయంగా ఖర్చు చేస్తున్నారా? లేక బీసీసీఐ భరిస్తుందా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. వాస్తవానికి, విదేశీ పర్యటనలో గాయపడిన ఏ భారత ఆటగాడికైనా వైద్య చికిత్స ఖర్చులను బీసీసీఐనే భరిస్తుంది. బీసీసీఐ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం,సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్ల వైద్య ఖర్చులు, పునరావాస ఖర్చులు పూర్తిగా బీసీసీఐ భాధ్యతగా ఉంటుంది.
Details
వన్డే సిరీస్ కు దూరం
అదేవిధంగా, గాయాల కారణంగా మ్యాచ్ ఫీజు పొందలేని ఆటగాళ్లకు బోర్డు నష్టపరిహారం కూడా అందిస్తుంది. ఉదాహరణకు, సిడ్నీలో గాయం చెందిన వెంటనే బీసీసీఐ మెడికల్ టీం ఆస్ట్రేలియాలోని నిపుణ వైద్యుల సహాయంతో చికిత్స ప్రారంభించింది. ఆటగాడు పూర్తిగా కోలుకునేందుకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ ప్రక్రియలో ఆటగాడు ఎటువంటి ఖర్చు భరించాల్సిన అవసరం ఉండదు. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో లేని ఆటగాళ్లకు కూడా ఇన్సూరెన్స్ సదుపాయం ఉన్నప్పటికీ, వారికి అందే సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. శ్రేయస్ అయ్యర్ విషయంలో అంతర్గత రక్తస్రావం కారణంగా పరిస్థితి ఒక దశలో తీవ్రమై, ప్రాణాపాయం తలెత్తడంతో ఐసీయూలో చేర్చారు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కు అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంది.