
Shreyas Iyer: ఇండియా-ఎ టీమ్ నుంచి అనూహ్యంగా వైదొలిగిన శ్రేయస్ అయ్యర్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా (Team India) మిడ్‌లార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇండియా-ఎ జట్టులోనుంచి అనూహ్యంగా వైదొలిగాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అయ్యర్, ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టుకు ముందే వ్యక్తిగత కారణాల వల్ల జట్టు నుండి దూరమైనట్లు తెలుస్తోంది. లఖ్‌నవూ నుంచి ముంబయి వెళ్లినట్లు సమాచారం. అయ్యర్ గైర్హాజరీలో ధ్రువ్ జురేల్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది జరగడానికి ముందు, ఆస్ట్రేలియా-ఎతో జరిగిన మొదటి అనధికారిక టెస్ట్‌లో అయ్యర్ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. 13 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 8 పరుగులు మాత్రమే సాధించాడు. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ కోరి రోకిసియోలి బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు, అయినప్పటికీ బంతి లెగ్‌స్టంప్ అవతకె దాటేలా కనిపించినప్పటికీ అంపైర్ ఔట్ ప్రకటించాడు.
Details
దులీప్ ట్రోఫీలో విఫలమైన అయ్యర్
అదేవిధంగా, ఈనెల ప్రారంభంలో బెంగళూరు వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో, వెస్ట్ జోన్ తరపున అయ్యర్ సెంట్రల్ జోన్‌పై కేవలం 25, 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇటీవల కాలంలో అతడి ప్రదర్శనలు చెప్పుకోదగినవిగా లేకపోయాయి. తదుపరి అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో భారత జట్టుకు జరగనున్న రెండు టెస్ట్‌ల హోమ్ సిరీస్‌లో మిడ్‌లార్డర్ స్థానానికి పోటీ కొనసాగుతుంది. అయినప్పటికీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ తన ప్రతిభ చాటాడు. ఐదు మ్యాచ్‌లలో 48.60 యావరేజ్‌తో 243 పరుగులు సాధించాడు. ఇక ఇండియా-ఎ లైనప్‌లో మరో మార్పు చోటుచేసుకుంది. ఖలీల్ అహ్మద్ స్థానంలో మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) జట్టులోకి చేరారు.