Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
బీసీసీఐ వార్షిక ఉత్తమ క్రికెటర్ అవార్డుకు టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మార్చి 15న జరిగే అవార్డు ప్రదానోత్సవంలో దీనిని ప్రకటించే అవకాశం ఉంది. 2025 సంవత్సరంలో శుభ్‌మన్ గిల్ టెస్టు క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి మొత్తం 983 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనే గిల్ 754 పరుగులు చేశాడు.
వివరాలు
అదరగొట్టిన గిల్
వన్డే ఫార్మాట్‌లో కూడా గిల్ మంచి ఫామ్‌లో ఆడి 490 పరుగులు చేశాడు. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో 188 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకంగా మారాడు. గత ఏడాది అన్ని ఫార్మాట్లు కలిపి శుభ్‌మన్ గిల్ మొత్తం 1764 పరుగులు చేశాడు. ఈ పరుగుల్లో 7 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి.
వివరాలు
ద్రవిడ్‌కు పురస్కారం
టీ20 ఫార్మాట్‌లో ఆశించిన స్థాయిలో గిల్ రాణించలేకపోయాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో గిల్‌కు అవకాశం దక్కలేదు. ఇక భారత మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం అందనుంది. 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.