LOADING...
T20 WC 2026: సికిందర్ రజా సెన్సేషన్‌.. టీ20ల్లో కొత్త చరిత్ర!
సికిందర్ రజా సెన్సేషన్‌.. టీ20ల్లో కొత్త చరిత్ర!

T20 WC 2026: సికిందర్ రజా సెన్సేషన్‌.. టీ20ల్లో కొత్త చరిత్ర!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఓడించి జింబాబ్వే జట్టు సంచలనం సృష్టించింది. ఆ ఊపును కొనసాగిస్తూ శ్రీలంకను కూడా మట్టికరిపించి గ్రూప్‌-బిలో టాపర్‌గా నిలిచింది. గురువారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లంక విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. లక్ష్య సాధనలో ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్‌), తడివానాషే మరుమాని (34) మంచి ఆరంభం అందించారు. అనంతరం కెప్టెన్‌ సికిందర్ రాజా 26 బంతుల్లో 45 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ప్రదర్శనతో రజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ క్రమంలో అతడు సరికొత్త చరిత్రను సృష్టించాడు.

Details

ప్రపంచ రికార్డులు

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికంగా 20సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న తొలి ఫుల్ మెంబర్ జట్టు ఆటగాడిగా రజా నిలిచాడు. అంతేకాకుండా, ఐసీసీ టోర్నీలో అత్యధిక వయసులో ఈ పురస్కారం అందుకున్న ఆటగాడిగా భారత దిగ్గజం రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 2025 చాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా రోహిత్‌ శర్మ 37 ఏళ్ల 335 రోజుల వయసులో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకోగా.. టీ20 వరల్డ్‌కప్‌-2026లో రజా 39 ఏళ్ల 301 రోజుల వయసులో ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు.

Details

ఫుల్ మెంబర్ జట్ల తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక POTM అవార్డులు

సికందర్‌ రజా (జింబాబ్వే) - 20సార్లు సూర్యకుమార్ యాదవ్ (ఇండియా) - 17సార్లు విరాట్ కోహ్లీ (ఇండియా) - 16సార్లు మహ్మద్నబీ (అఫ్గానిస్తాన్) - 14సార్లు మొత్తానికి, రజా అద్భుత ప్రదర్శనతో జింబాబ్వే విజయాన్ని అందించడమే కాకుండా ప్రపంచ రికార్డులను కూడా తిరగరాశాడు.

Advertisement