Asian Games 2023 : శబాష్ రోషిబినా దేవి.. వుషులో భారత్‌కు రజత పతకం
చైనాలోని హాంగ్ జౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో 2023లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌కు మరో పతకం లభించింది. వుషు క్రీడల్లో మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి నౌరెమ్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 60 కిలోల వుషు(సాండా) సెమీఫైనల్లో వియత్నాంకు చెందిన థి థు థుయ్ న్గుయెన్‌ను రోషిబినా దేవి చిత్తు చేసింది రెండు రౌండ్ల తర్వాత న్యాయమూర్తులు స్థానిక అథ్లెట్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఇక రోషిబినా తన ప్రత్యర్థి కాలును పట్టుకోవడం ప్రయత్నించింది. అయితే ఆమెను చాప పై నుంచి నెట్టలేకపోయింది. ఇక రెండో రౌండులో రోషిబినా ఆటలో వేగంగా రాణించింది.
రెండో భారతీయురాలిగా నిలిచిన రోషిబినా
2010 సంవత్సరంలో గ్వాంగ్ జౌలో జరిగిన క్రీడల్లో సంధ్యారాణి తర్వాత వుషు ఫైనల్ కు చేరిన రెండో భారతీయురాలిగా రోషిబినా నిలిచింది. వీసా సమస్యల కారణంగా చైనాకు రాలేకపోయిన అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ముగ్గురు వుషు ఆటగాళ్లకు రోషిబినా తన పతకాన్ని అంకితం చేసింది. తన ముగ్గురు స్నేహితురాళ్ల కోసం స్వర్ణం పతకం గెలవాలనుకున్నానని, అయితే రజత పతకం దక్కిందని రోషిబినా చెప్పారు. ఇప్పటివరకూ ఆసియా క్రీడల్లో భారత్ 24 పతకాలను సాధించింది. ఇందులో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్యాలు దక్కాయి.