ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం
స్కై స్పోర్ట్స్ ఎనిమిదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024 నుండి 2031 వరకు యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్‌లో జరిగే అన్ని ప్రపంచకప్‌లను ఈ సంస్థ ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఐసీసీ ధ్రువీకరించింది. UK మార్కెట్‌లో మీడియా హక్కుల కోసం బిడ్డింగ్ ప్రక్రియ లేనందున ICC నేరుగా స్కై స్పోర్ట్‌తో పనిచేయాలని నిర్ణయించుకుంది. ఎనిమిదేళ్ల పాటు ICC ఈవెంట్‌లను (పురుషులు, మహిళలు) ప్రసారం చేయనుంది. స్కై స్పోర్ట్ వన్డే, T20 ప్రపంచ కప్‌లతో సహా మొత్తం 28 అంతర్జాతీయ ఈవెంట్‌లను ప్రసారమయ్యే అవకాశం ఉంది. ప్రతి రెండు సంవత్సరాలకు ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను, అండర్-19 టోర్నమెంట్‌లను ప్రసారం చేయడం కూడా ఈ ఒప్పందంలో ఉంది.
ఈ ఒప్పందంతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించే అవకాశం
ముఖ్యంగా 2025 WTC ఫైనల్, 2026 మహిళల T20 WC, 2030 పురుషుల T20 WC ప్రసారమయ్యే చేసే అవకాశం ఉంది. ఈ కీలక ఒప్పందంపై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ స్పందించారు. ఈ భాగస్వామ్యం మరింత మంది ఆటగాళ్లను, ఎక్కువ మంది అభిమానులను ఆటకు ఆకర్షించాలనే చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతీయ మార్కెట్లో, డిస్నీ స్టార్ 2024, 2027 మధ్య అన్ని ICC ఈవెంట్‌ల ప్రసారం చేసే హక్కులను కలిగి ఉంది. డిస్నీ స్టార్ బిడ్ విలువను వెల్లడించకపోయినా ESPNcricinfo ప్రకారం, ఇది $1.44 బిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.