Smriti Mandhana Wedding:పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్మృతి మంధాన ..! పెళ్లి కొడుకు ఎవరంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
విమెన్ టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 20న ఆమె వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇక ఆమె జీవిత భాగస్వామి ఎవరో తెలుసా? ప్రముఖ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, దర్శకుడు పలాష్ ముచ్చల్ అని పలు కథనాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్ స్టార్‌లకంటే తక్కువ అభిమానులు లేని స్మృతి, తన ఆటతో పాటు తన అందంతోనూ విశేషంగా గుర్తింపు సంపాదించారు. భారత మహిళా జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకరిగా ఆమె స్థానం బలపరిచుకున్నారు.
డేటింగ్
చాలా ఏళ్లుగా డేటింగ్‌లో వాళ్లిద్దరూ
స్మృతి మంధాన,పలాష్ ముచ్చల్ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పలాష్ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ..స్మృతి మంధానను ఇండోర్ కోడలిగా చేస్తానని ప్రకటించారు ,దాంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ జంట వివాహ తేదీ, వేదికపై పలు అప్‌డేట్‌లు వైరల్ అవుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పలాష్-స్మృతి వివాహం నవంబర్ 20న మహారాష్ట్రలోని సాంగ్లి నగరంలో జరుగనుందని చెబుతున్నారు. సాంగ్లి అంటే స్మృతి మంధాన స్వస్థలం కావడం విశేషం.అయితే, అధికారికంగా ఈ వివాహంపై ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
వివరాలు
పలాష్ ముచ్చల్ ఎవరు?
స్మృతి,పలాష్ 2019 నుంచే ప్రేమలో ఉన్నారని, ఐదేళ్ల పాటు ఆ బంధాన్ని గోప్యంగా కొనసాగించారని సమాచారం. 2024లో మాత్రం వారు తమ సంబంధాన్ని పబ్లిక్‌గా అంగీకరించారు. ప్రస్తుతం స్మృతి మంధాన మహిళల వన్డే ప్రపంచ కప్ సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. పలాష్ ముచ్చల్ 1995 మే 22న ఒక మార్వారీ కుటుంబంలో జన్మించారు. ఆయన బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ సోదరుడు. గాయకుడిగా మాత్రమే కాకుండా,సంగీత దర్శకుడు,నటుడు,దర్శకుడిగానూ పలాష్ తన ప్రతిభను నిరూపించారు.
వివరాలు
18 ఏళ్ల వయసులోనే మొదటి పాట కంపోజ్
రాజ్‌పాల్ యాదవ్,రుబీనా దిలైక్ నటించిన "అర్ధ్" అనే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. అలాగే తన సోదరి పాలక్‌తో తరచూ స్టేజ్ ప్రదర్శనలు ఇస్తుంటారు. పలాష్ బాలీవుడ్‌లో అతి పిన్న వయస్కుడైన సంగీత దర్శకుడుగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే తన తొలి పాటను స్వరపరిచారు.