
Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్.. రెండో స్థానానికి స్మృతి మంధాన
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టైలిష్ ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధాన రెండో స్థానానికి చేరుకుంది.
శ్రీలంకలో నిర్వహించిన ముక్కోణపు సిరీస్‌ను భారత్ గెలుచుకోవడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.
ఈ సిరీస్‌లో ఆమె ప్రదర్శన నేపథ్యంలో ఒక స్థానం మెరుగుపర్చుకొని ర్యాంకింగ్స్‌లో ఎగబాకింది.
మొత్తం అయిదు ఇన్నింగ్స్‌లలో స్మృతి 264 పరుగులు చేసింది. ముఖ్యంగా ఫైనల్లో శ్రీలంకపై 101 బంతుల్లో 116 పరుగులు సాధించి భారత్ విజయంలో కీలకంగా నిలిచింది.
వివరాలు
లారా వోల్వార్ట్‌కు 11 రేటింగ్ పాయింట్ల దూరంలో స్మృతి
ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న లారా వోల్వార్ట్‌కు స్మృతి కేవలం 11 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉంది.
స్మృతి మంధాన చివరిసారి 2019లో వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకుంది.
ఇతర విభాగాల్లో కూడా భారత మహిళా క్రికెటర్ల ప్రదర్శన ప్రాశంసనీయంగా ఉంది.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ నాల్గవ స్థానంలో నిలవగా, ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ ఎకిల్‌స్టోన్ నంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతోంది.
ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లైన ఆష్లీ గార్డ్‌నర్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెండో స్థానానికి స్మృతి మంధాన
🚨 🚨 #BreakingNews Smriti Mandhana rises to 2nd spot in ODI batting rankings after prolific tri series https://t.co/QhUanIWypA
— Instant News ™ (@InstaBharat) May 13, 2025
Smriti Mandhana rises to nd spot in ODI batting rankings after prolific tri series#TrendingNews #BigBreaking