Page Loader
Smriti Mandhana : టీ20ల్లో స్మృతి మంధాన అరుదైన ఘనత.. భారత క్రికెట్‌కు గర్వకారణం!
టీ20ల్లో స్మృతి మంధాన అరుదైన ఘనత.. భారత క్రికెట్‌కు గర్వకారణం!

Smriti Mandhana : టీ20ల్లో స్మృతి మంధాన అరుదైన ఘనత.. భారత క్రికెట్‌కు గర్వకారణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 02, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా మహిళల క్రికెట్‌ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న స్మృతి మంధాన అరుదైన ఘనతను సాధించింది. ఆమె భారత్ తరపున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 మ్యాచ్‌లు ఆడి, పురుషుల, మహిళల టీ20 ఫార్మాట్‌ను కలిపిన విభాగంలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డులోకి ఎక్కింది. ఈ జాబితాలో 179 మ్యాచ్‌లతో హర్మన్‌ప్రీత్ కౌర్ తొలి స్థానంలో ఉండగా, 159 మ్యాచ్‌లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా మంధాన తన 150వ మ్యాచ్‌ ఆడింది.

Details

మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు

1. హర్మన్‌ప్రీత్ కౌర్ (భారతదేశం) - 179 మ్యాచ్‌లు 2. సుజీ బేట్స్ (న్యూజిలాండ్) - 177 3. డానీ వ్యాట్-హాడ్జ్ (ఇంగ్లాండ్) - 175 4. ఎలీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) - 168 5. అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా) - 162 6. నిదా దార్ (పాకిస్తాన్) - 160 7. స్మృతి మంధాన (భారతదేశం) - 150

Details

24 పరుగుల తేడాతో ఓటమి

ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (63), అమన్‌జోత్ కౌర్ (63 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీలతో జట్టును శక్తివంతంగా నిలిపారు. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ జట్టు 157 పరుగులకే పరిమితమై, భారత్ చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్మృతి మంధాన రికార్డు, భారత్ విజయం కలిసి, ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకం చేసాయి.