
Smriti Mandhana: స్మృతి మంధాన సెన్సేషన్ రికార్డు.. వన్డే చరిత్రలోనే..!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరో చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాలో ఆమె పేరు నిలిచింది. శనివారం దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేవలం 50 బంతుల్లో శతకం పూర్తి చేసి ఈ ఘనత సాధించింది. దీంతో వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు నమోదైన వేగవంతమైన శతకాల జాబితాలో రెండో స్థానానికి చేరి, తొలి భారత బ్యాటర్‌గా ఈ రికార్డును దక్కించుకుంది. ఇదే సందర్భంలో 24 ఏళ్లుగా నిలిచిన రికార్డును ఆమె బద్దలు కొట్టింది.
Details
ఆరంభం నుంచే అగ్రెసివ్ గా ఆడిన మంధాన
ఈ మ్యాచ్‌లో స్మృతి ఆరంభం నుంచే అగ్రెసివ్‌గా ఆడింది. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో కేవలం 50 బంతుల్లో శతకం నమోదు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా బ్యాటర్లు కారెన్ రోల్టన్, బెత్ మూనీ వరుసగా 57 బంతుల్లో సెంచరీలు చేసిన రికార్డులను స్మృతి అధిగమించింది. మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ మాత్రం ఇప్పటికీ ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లాన్నింగ్ పేరిటే ఉంది. ఆమె 2013లో నార్త్ సిడ్నీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌పై 45 బంతుల్లో సెంచరీ బాదింది. ప్రస్తుతం స్మృతి రెండో స్థానంలో నిలిచింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, స్మృతి గతంలో 70, 77 బంతుల్లో శతకాలు సాధించగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 82 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు కలిగి ఉంది.
Details
మహిళల వన్డేల్లో వేగవంతమైన సెంచరీలు
45 బంతులు - మెగ్ లాన్నింగ్ vs న్యూజిలాండ్, నార్త్ సిడ్నీ ఓవల్, 2012 50 బంతులు - స్మృతి మంధాన vs ఆస్ట్రేలియా, ఢిల్లీ, 2025 57 బంతులు - కరెన్ రోల్టన్ vs దక్షిణాఫ్రికా, లింకన్, 2000 57 బంతులు - బెత్ మూనీ vs ఇండియా, ఢిల్లీ, 2025 59 బంతులు - సోఫీ డివైన్ vs ఐర్లాండ్, డబ్లిన్, 2018 60 బంతులు - చమరి అటపట్టు vs న్యూజిలాండ్, గాలే, 2023 మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు 15 - మెగ్ లాన్నింగ్ 13 - సుజీ బేట్స్ 13 - స్మృతి మంధాన 12 - టామీ బ్యూమాంట్