
Smriti Mandhana : స్మృతి మంధానా వరల్డ్ రికార్డు.. ఏకైక మహిళా క్రికెటర్‌గా ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళా క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో అద్భుతమైన రికార్డు నెలకొల్పింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించి, అరుదైన ఘనత సాధించింది. ఆమె ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు వన్డే సెంచరీలు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.
ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ, స్మృతి మంధానా 109 బంతుల్లో 105 పరుగులు చేసింది.
అయితే ఆమె ఔటయ్యాక ఇండియా టీమ్ కోలుకోలేక పోయింది. దీంతో పరాజయం పాలైంది
Details
ఒకే ఏడాది నాలుగు సెంచరీలు
ఈ ఏడాది ఆమె సాధించిన నాలుగో సెంచరీ ఇది. ఇంకా ఏ మహిళా క్రికెటర్ ఈ స్థాయిలో రాణించలేదు.
గతంలో మూడు సెంచరీలు సాధించిన మహిళా క్రికెటర్లు చాలా మంది ఉన్నప్పటికీ, ఆమె నాలుగో సెంచరీ చేసి సత్తా చాటింది.
స్మృతి మంధానా ఇప్పటివరకు వన్డేల్లో 9 సెంచరీలు సాధించింది. ఇది ఆమె కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.