LOADING...
Smriti Mandhana: పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఆ మహిళా క్రికెటర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పలాశ్‌! 
ఆ మహిళా క్రికెటర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పలాశ్‌!

Smriti Mandhana: పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఆ మహిళా క్రికెటర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పలాశ్‌! 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె నవంబర్ 23న వివాహం చేసుకోవాలన్న ప్రణాళిక ఉండేది, అయితే ఊహించని పరిస్థితుల కారణంగా పెళ్లి కొన్ని గంటల ముందు వాయిదా పడింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యం బాగా క్షీణించడంతోపాటు,పలాష్ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం రావడంతో డిసెంబర్ 7న ఈ వివాహం జరగదని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తరువాత, డిసెంబర్ 7 మధ్యాహ్నం స్మృతి సోషల్ మీడియా ద్వారా తన వివాహం రద్దయినట్లు అధికారికంగా ప్రకటించారు.

వివరాలు 

మీడియాలో కొన్ని షాకింగ్ విషయాలు 

స్మృతి తన పోస్టులో వివాహం రద్దు అయిన కారణాలను ప్రత్యేకంగా వెల్లడించలేదు. అయితే, పెళ్లి వాయిదా పడినప్పటి నుంచి కొన్ని షాకింగ్ విషయాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. పలాష్ ముచ్చల్ ఒక మహిళతో చాటింగ్ చేసిన కొన్ని స్క్రీన్‌షాట్లు కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయమే వివాహం రద్దు అవడానికి ప్రధాన కారణమైందని న్యూస్‌లో వెల్లడి చేయబడింది. ఇప్పటివరకు మరో షాకింగ్ సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివాహానికి ఒక రోజు ముందు రాత్రి, పలాష్ ఓ మహిళా క్రికెటర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా కనిపించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో స్మృతి ఫామ్‌హౌస్‌లో తన స్నేహితులతో సరదాగా గడుపుతున్నారు. ఈ దృశ్యం టీమిండియా క్రికెటర్ శ్రేయంకా పాటిల్‌కు కనిపించిందని సమాచారం.

వివరాలు 

 పలాష్‌ను కొట్టిన స్మృతి సోదరుడు 

కాగా, కొరియోగ్రాఫర్ నందిక ద్వివేదితో పలాష్ సన్నిహితంగా ఉన్నట్టు శ్రేయంకా చూశారని, వెంటనే స్మృతి కి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. స్మృతి కూడా పలాష్, నందికను అసహ్యకరమైన పరిస్థితిలో చూసినట్లు చెబుతున్నారు. ఈ వివాదంలో స్మృతి సోదరుడు పలాష్‌ను కొట్టి గొడవ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ కొద్దిరోజులమాత్రమే ఉన్నారని తెలుస్తోంది. తరువాత, స్మృతి తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, పెళ్లి వాయిదా పడిందని అందరికి చెప్పినట్లు సమాచారం. పలాష్ ఆరోగ్య సమస్యల కారణంగా అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, తన మీద విమర్శలు రాకుండా, స్మృతి తప్పు అన్నట్టు చూపించడానికి ఒక పీఆర్ కంపెనీకి భారీ మొత్తంలో డబ్బు చెల్లించాడని కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement