
Sourav Ganguly: దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై సౌరవ్ గంగూలీ కారుకు ప్రమాదం.. లారీ సడెన్‌గా రావడంతో..
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ మరియు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ రోడ్డు ప్రమాదానికి గురైనట్టు సమాచారం.
పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ వద్ద ఓ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
గంగూలీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనప్పటికీ, అతనికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ప్రమాదం ఎలా జరిగింది?
బుర్ద్వాన్‌లోని ఓ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు గంగూలీ తన రేంజ్ రోవర్ కారులో బయలుదేరారు.
ఆయన వెంట మరిన్ని రెండు కార్లు కాన్వాయ్‌గా వెళ్తుండగా, దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్ వేపై అకస్మాత్తుగా ఓ లారీ వారి కాన్వాయ్‌లోకి దూసుకొచ్చింది.
దీంతో కార్లు అదుపుతప్పగా,గంగూలీ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ అత్యవసరంగా బ్రేక్ వేశాడు.
ఫలితంగా వెనుక వస్తున్న మరో కారు గంగూలీ రేంజ్ రోవర్‌ను ఢీకొట్టింది.ఈ ఘటన సమయంలో కాన్వాయ్ సామాన్య వేగంతో ఉండటం వల్ల ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే గంగూలీ కారు దిగిపోయి,తన వెనుక ఉన్న వారిని పరామర్శించారు.
దాదాపు పది నిమిషాల పాటు హైవేపై ఉండాల్సి వచ్చిన గంగూలీ,పరిస్థితి సద్దుమణిగిన తర్వాత విశ్వవిద్యాలయానికి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వివరాలు
అభిమానుల ఆందోళన
ఈ విషయం తెలియగానే గంగూలీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. భారత క్రికెట్‌కు ఆయన అందించిన సేవలు అపారమైనవి.
ఇండియన్ క్రికెట్‌ను కొత్త దారిలో నడిపించిన కెప్టెన్‌గా గంగూలీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
అతను కేవలం కెప్టెన్ మాత్రమే కాకుండా, అద్భుతమైన బ్యాట్స్‌మన్ కూడా. సచిన్ టెండూల్కర్‌కు సమానంగా గంగూలీ కూడా క్రికెట్‌లో విశేష ప్రతిభ చూపారు. అందుకే అభిమానులు ఆయనను ముద్దుగా "దాదా" అని పిలుస్తుంటారు.
అలాగే, బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా గంగూలీ కీలక పాత్ర పోషించారు.