
Sourav Ganguly: సౌరభ్ గంగూలీ ఇంట్లో దొంగతనం.. పోలీసులకు ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
బీసీసీఐ మాజీ చీఫ్, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇంట్లో చోరీ జరిగింది. దొంగతనంపై గంగూలీ ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
చోరీకి గురైన వాటిలో గంగూలీ ఫోన్ కూడా ఉంది. అందులో గంగూలీకి సంబంధించిన కీలకమైన సమాచారం ఉన్నట్లు అతని సిబ్బంది చెబుతున్నారు.
బెహలాలోని తన ఇంట్లో పెయింటింగ్ పని జరుగుతోంది. ఈ క్రమంలో గంగూలీ తన ఫొన్‌ను ఇంట్లో ఒక చోట పెట్టి బయటకు వెళ్లాడు.
తిరిగి వచ్చే సరికి అతని ఫోన్ కనిపంచలేదు. చోరీకి గురైన గంగూలీ ఫోన్ విలువ రూ.1.60లక్షలు ఉంటుందని సమాచారం.
పోలీసులు పెయింటింగ్ పని చేస్తున్న వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారని పిలిపించి విచారిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫోన్ విలువ రూ.1.60లక్షలు
Sourav Ganguly phone got stolen from his home - he registered complaint in police station. pic.twitter.com/1Xcolu6Xtx
— Cric Point (@RealCricPoint) February 11, 2024