IND vs SA: దక్షిణఫ్రికా 153 ఆలౌట్.. భారత్ విజయ లక్ష్యం 124
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఢీకొంటున్నాయి. 93/7తో రెండో రోజు ముగించిన సఫారీలు మూడో రోజు తిరిగి బ్యాటింగ్ ప్రారంభించి మొత్తం 53.5 ఓవర్లకే 153 పరుగుల వద్ద ఆలౌటయ్యారు. దీంతో టీమ్‌ఇండియా ముందు 124 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా నిర్దేశించింది. బవుమా (55*, 136 బంతుల్లో, 4 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసి,టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రికెల్టన్ (11),మార్‌క్రమ్ (4),ముల్డర్ (11),టోనీ డి జోర్జీ (2),ట్రిస్టాన్ స్టబ్స్ (5),కైల్ వేరీన్ (9)లందరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కోర్బిన్ బోష్ (25) కొంతవరకు ప్రతిఘటించాడు.భారత బౌలింగ్‌లో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు,బుమ్రా-అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
వివరాలు
భారత్ మొదటి ఇన్నింగ్స్ 189 పరుగులకు అల్ ఔట్
ఇందుకు ముందు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కూడా 55 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో మార్‌క్రమ్ (31) టాప్‌స్కోరర్. రికెల్టన్ (23), ముల్డర్ (24), టోనీ డి జోర్జీ (24) కొంత సమగ్రత చూపినా కెప్టెన్ బవుమా (3) మాత్రం విఫలమయ్యాడు. ఆ ఇన్నింగ్స్‌లో బుమ్రా 5/27తో అద్భుత ప్రదర్శన చేశాడు. సిరాజ్—2, కుల్‌దీప్—2, అక్షర్—1 వికెట్ తీసుకున్నారు. తర్వాత భారత్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించి 62.2 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.
వివరాలు
గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అందుబాటులో ఉండడు: బీసీసీఐ
దీంతో 30 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ఆ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (39) ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్. వాషింగ్టన్ సుందర్ (29), రిషభ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27) తమకు లభించిన ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. యశస్వి జైస్వాల్ (12), ధ్రువ్ జురేల్ (14) నిరాశ కలిగించారు. శుభ్‌మన్ గిల్ (4*) రిటైర్డ్ హర్ట్‌గా బయటకు వెళ్లగా, అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అందుబాటులో ఉండడంలేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ చేసిన ట్వీట్
Jasprit Bumrah 🤝 Timber strike
— BCCI (@BCCI) November 16, 2025
A crucial partnership broken, courtesy of that man again 👏👏
Updates ▶️ https://t.co/okTBo3qxVH#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @Jaspritbumrah93 pic.twitter.com/PKgje6HtRF