Page Loader
Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ తన అభిమానులకు షాకిచ్చాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్లాసెన్... ఇప్పుడు వన్డేలు, టీ20లు రెండింటికీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోమవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించాడు. తన 33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌ను వీడుతున్నట్లు ప్రకటించడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. తన ఆట జీవితం పట్ల ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, ఇప్పటివరకు తనను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు క్లాసెన్.

Details

2017లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం

అయితే ప్రొఫెషనల్ లీగ్‌లలో మాత్రం తన ఆట కొనసాగిస్తానని చెప్పాడు. అతడి ఫెర్మార్మెన్స్‌ను ఇష్టపడే అభిమానులు ఈ ప్రకటనతో నిరాశ చెందుతున్నారు. క్లాసెన్ 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, మిడిలార్డర్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.