Page Loader
ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయల్స్‌కు వచ్చేయ్..  బజరంగ్ పూనియాను సాయ్ లేఖ 
ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయల్స్ కు రమ్మని బజరంగ్ పూనియాకు ఆహ్వానం

ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయల్స్‌కు వచ్చేయ్..  బజరంగ్ పూనియాను సాయ్ లేఖ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 22, 2023
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of India) సాయ్ నుండి ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పూనియాకు లేఖ వచ్చింది. ప్రపంచ ఛాంపియష్ షిప్ పోటీల్లో పాల్గొనడానికి ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, అందుకోసం హాజరు కావాలని సాయ్ ఆదేశించింది. ఒకవేళ ట్రయల్స్ కు రాలేకపోతే ఫిట్ నెస్ సర్టిఫికెట్ అందజేయాలని సాయ్ సూచించింది. రెజ్లర్ బజరంగ్ పూనియా, ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఆడకుండా డైరెక్టుగా ఆసియా క్రీడల్లో ఆడాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఆసియా క్రీడల కోసం శిక్షణ తీసుకోవడానికి ఫారెన్ వెళ్ళాలని బజరంగ్ పూనియా భావిస్తున్నారని అంటున్నారు.

Details

చైనాలో జరగనున్న ఆసియా క్రీడలు 

ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్ల సమయం వృథా అవుతుందని, ఆసియా క్రీడల కోసం మరింత శిక్షణ అవసరమని, అందువల్ల ట్రయల్స్ లో పాల్గొనకుండా డైరెక్టుగా డైరెక్టుగా ఆసియా క్రీడల్లో పాల్గొనాలని బజరంగ్ పూనియా అనుకుంటున్నారని తెలుస్తోంది. బజరంగ్ పూనియా మాత్రమే కాదు, కామన్ వెల్త్ లో బంగారు పతకం సాధించిన దీపక్ పూనియా సైతం ఆసియా క్రీడల కోసం సమాయత్తం కావడానికి ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయల్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఇకపోతే ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23నుండి చైనా లోని హాంగ్జౌ నగరంలో జరగనున్నాయి.