SRH IPL 2026: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కాటేరమ్మకొడుకులు.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ప్రయాణం ముగిసింది. మే 27న న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో హైదరాబాద్ 47 పరుగుల తేడాతో పరాజయం చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్, విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరూ వరుసగా భారీ స్కోర్లు నమోదు చేస్తూ జట్టుకు బలమైన అండగా నిలిచారు. ఈ క్రమంలోనే ఈ జంట ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను అందుకుంది. ఒకే ఐపీఎల్ సీజన్‌లో ఒకే జట్టు తరఫున ఇద్దరు బ్యాటర్లు 600కిపైగా పరుగులు చేసిన ఏడో జోడీగా ఇషాన్ కిషన్ - హెన్రిచ్ క్లాసెన్ నిలిచారు.
వివరాలు
ఒకే ఐపీఎల్ సీజన్‌లో ఒకే జట్టు నుంచి 600కి పైగా పరుగులు చేసిన జోడీలు
క్రిస్ గేల్ - విరాట్ కోహ్లీ (ఆర్సీబీ - 2013) విరాట్ కోహ్లీ - ఏబీ డివిలియర్స్ (ఆర్సీబీ - 2016) రుతురాజ్ గైక్వాడ్ - ఫాఫ్ డు ప్లెసిస్ (సీఎస్‌కే - 2021) విరాట్ కోహ్లీ - ఫాఫ్ డు ప్లెసిస్ (ఆర్సీబీ - 2023) శుభ్‌మన్ గిల్ - సాయి సుదర్శన్ (జీటీ - 2025) శుభ్‌మన్ గిల్ - సాయి సుదర్శన్ (జీటీ - 2026) హెన్రిచ్ క్లాసెన్ - ఇషాన్ కిషన్ (ఎస్ఆర్‌హెచ్ - 2026)
వివరాలు
రాజస్థాన్ బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన..
ఇక ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు ధ్రువ్ జురెల్ 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి జట్టుకు మరింత బలం చేకూర్చాడు. 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రాజస్థాన్ బౌలర్లు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చారు. రాజస్థాన్ బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు 196 పరుగులకే పరిమితమై 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.